calender_icon.png 15 September, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లి జనార్ధన్ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు

15-09-2025 05:46:32 PM

నకిరేకల్,(విజయక్రాంతి): మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్ధన్ సమాజానికి చేస్తున్న సేవలను న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ గుర్తించి మదర్ సర్వీస్ సొసైటీ డాక్టర్ మల్లాది ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలో సినీ ప్రముఖుల చేతుల మీదుగా నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు 2025ను అందుకున్నారు. జనార్ధన్ మాజీ సైనికుడు, సినీ నటుడు, సినిమా ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్ గా వివిధ రంగాలలో చేస్తున్న సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ ఇటీవల భారత్ సేవ విభూషణ్ నేషనల్ అవార్డు 2025 ను అందజేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మహానుభావుల పేరు మీద ఉన్నటువంటి అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మదర్ సర్వీసెస్ సొసైటీ కి కృతజ్ఞతలు తెలిపారు.