15-09-2025 05:38:02 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని వికలాంగుల జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు. వికలాంగుల ఆధ్వర్యంలో తాసిల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకటించిన విధంగా వికలాంగులకు నెలకు రూ.6000 పెన్షన్ పెంచుతాన ని మాట ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వికలాంగులు , వృద్ధులు, వితంతువులు పెన్షన్ పెంచడం లేదని వెంటనే ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వికలాంగుల పెన్షన్ పెంచి ఆదుకోవాలని అన్నారు. అంతకు ముందు గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.