15-09-2025 05:44:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సత్వర పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా కల్పించారు