12-01-2026 01:38:59 AM
మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న టీచర్లు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి ఉండాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈసారి టీచర్ల కూడా టెట్ రాస్తున్నారు. అయితే పదిహేను ఇరువై సంవత్సరాలుగా ఉద్యోగాల్లో ఉన్న తమకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి సుప్రీంలో రివ్యూ పిటీషన్లను కూడా వివిధ ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేశాయి. పరీక్ష సిలబస్‌లో తమకు సంబంధంలేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతు న్నారు.
సుప్రీంకోర్టు తీర్పు మూలంగా ఎంత మంది ఇన్‌సర్వీస్ టీచర్లు నష్టపోతున్నారో వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఇటీవల లేఖలు రాసింది. ఆ ఉపాధ్యా యుల వివరాలను ఈనెల 16లోగా కేంద్రానికి సమర్పించాలని పేర్కొంది. అలాగే సమస్య పరిష్కారానికి గల న్యాయపరమైన అవకాశాలను కూడా తెలపాలని కోరడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో సుమారుగా 40 వేల మందికిపైగా ఇన్‌సర్వీస్ టీచర్లు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.