calender_icon.png 6 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ నినాదం గెలిపించేనా!

06-11-2025 01:06:52 AM

జూబ్లీహిల్స్  ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ సాగుతున్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం రెండు పార్టీల మధ్యే నడుస్తుందనిపిస్తున్నది. సిట్టింగ్ సీ టు కాపాడుకోవడం కోసం గులాబీ పార్టీ, ప్రజాపాలన రెఫరెండం కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ హోరాహోరీగా పో రాడుతున్నాయి. ఈ ఎన్నిక ఫలితం రా ష్ర్టంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ది ఆసక్తిగా మారింది.

అయితే ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓట్లను ప్రభావితం చేసే కులాలను మచ్చిక చేసుకునేందుకు నాయకులకు అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ని లిచిపోయే అవకాశముంది. నిత్యం అబద్దాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తూ, సవా ళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోం ది. ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనే 2018 లో 34 శాతం, 2023లో 35శాతం చెక్కుచెదరని ఓటు బ్యాంకును కలిగిన కాంగ్రెస్, బలమైన సామాజిక వర్గానికి చెందిన స్థాని క అభ్యర్థిని పెట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

మొత్తం ఓటర్లలో ఒక లక్ష నలభై వేలు బీసీలు ఉన్నారని గణాంకాలు చెప్పుతున్నాయి, దాదాపు లక్ష ఓట్లు ఉన్న ము స్లిం మైనార్టీలు మజ్లిస్ పార్టీ పోటీచేయనందున కాంగ్రెస్‌కు బదిలీ అవుతుందనే ప్రచారం ఊపందుకుంది.అయితే రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఏకపక్షంగా ఉండదనే భావం ఏర్పడింది, అందుకే అజారుద్దీన్‌కు మంత్రిపదవి కట్టబెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఒక ఎత్తు, ఇక ముందు జరిగే ప్రచారం ఒకెత్తు. మొత్తానికి రానున్న వారం రోజులు అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి.

కాంగ్రెస్ మాత్రమే

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మాగంటి గోపినాధ్ మరణంతో వచ్చిన ఉపఎన్నిక బీజేపీకి పెద్దగా ఉపయోగపడనప్పటికీ అధికార కాంగ్రెస్, బీఆ ర్‌ఎస్‌కు మాత్రం ప్రతిష్ఠాత్మకంగా మారిం ది. బీసీ రిజర్వేషన్ల అంశం మీద బీసీ నినా దం రాష్ర్టంలో కొలిమిలా సలసల కాగుతుంటే కాంగ్రెస్ తప్ప ఎవ్వరు బీసీలకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చే స్తున్న అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి కేవలం 5 శాతం మార్జిన్ తో ఓడిపోయా రు. ఆ తర్వాత 2018లో  స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి పరాజయం చవిచూశారు. 

అయితే ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండగా, బీఆర్‌ఎస్ నుంచి గోపినాధ్ సతీమణి సునీ త పోటీలో ఉంటే, బీజేపీ మాత్రం గతంలో పోటీ చేసి 25 శాతం ఓట్లు సాదించిన దీపక్ రెడ్డిని బరిలో నిలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 4,01,365 లక్షల మంది ఓటర్లు ఈ నెల 11న అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. కులాల వారీగా ఆయా సంఘాలతో సమావేశాలు, విందు లు, కాలనీలు, డివిజన్లలో పలుకుబడి కలిగిన నాయకులను తమవైపు తిప్పుకోవడం లో పార్టీలు పూర్తిగా తలమునకలై ఉన్నా  యి.

గెలిచినా ఎమ్మెల్యేలు ఫిరాయించడం వల్ల, బీఆర్‌ఎస్ గెలిచి ప్రయోజనం లేదని చాలా మంది అధికార పార్టీ వైపు చూస్తున్నారు. మూడు పార్టీలకు చావో రేవో అ న్న మాదిరిగా మారడంతో చోటా, బడా నాయకులను చేరదీసి వారి స్థాయిని బట్టి పార్టీలు భారీగా ముడుపులు అందిస్తున్నా రు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంతోమంది భవిష్యత్ నిర్దారించే ఎన్నిక మాత్రం కాదు సుమా, వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టే మహమ్మారి కూడా. తమ సమస్యలు పక్కకు బెట్టి ఎన్నికల్లో డబ్బు పంచడం గురించి చర్చించుకుంటున్నారు.

ఎన్నికల్లో నిఘా ఎక్కువగా ఉందని, వారం ముందుగానే ‘మా డివిజన్ లో ఫలానా నాయకు డు, మా కుల సంఘ నాయకుడికి అందించారని, మాకు ఇంకా రాలేదని, పోలింగ్‌కు ముందు ఇస్తారేమో’ అని గుస గుసలు పెట్టుకోవడం గమనార్హం. మాగంటి గోపీనాద్ హ్యాట్రిక్ సాధించిన ఈ నియోజక వర్గాన్ని గెలవడానికి  బీఆర్‌ఎస్  సర్వశక్తులు ఒడ్డుతోంది.వరుసగా ఆ పార్టీ తరఫు న గెలిచి నాటి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాగంటి గోపినాధ్ సతీమణి అభ్యర్థి సునీతకు ప్రత్యర్థిగా అధికార కాంగ్రెస్ అభ్యర్థి బీసీ బిడ్డ. స్థానికుడు నవీన్ యాదవ్ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

ప్రభుత్వం ముందుచూపు

మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే మకాం వేసి అన్నీ తానై వ్యవహరిస్తో న్నారు. కృష్ణార్జునులా దూసుకపోదామం టే.. ట్రబుల్ షూటర్ హరీష్ తండ్రి మర ణం వారి వ్యూహాన్ని బెడిసికొట్టింది. స్థాని క ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ మరణం తర్వాత ముందు చూపుతో అధికార పార్టీ షేక్ పేట్, రహ్మత్ నగర్, యూసఫ్ గూడ, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో 120 కోట్ల పనులు మంజూరు చేసింది.

ఇప్పటికే అనేక అభివృద్ధి పనుల కు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ గెలుపు మీ ద ఆశ  ఉన్నప్పటికీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్  అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు, కాంగ్రెస్ సామాజిక న్యాయం ఏజెండాగా బీసీలను ఐక్యత చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న పామునైన పెద్ద కట్టె తో కొట్టాలని మైనార్టీల ఓట్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు మహమ్మద్ అజారు ద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మైనార్టీ, సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖను కేటాయించడంతో  మత పెద్దలను కూడగట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.

అ యితే ఈస్టమన్ కలర్ ఎలా ఉంటుందో.. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు కూడా కలెగూరగంపలా ఉంటారు. సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యో గులు, సినీ కార్మికులు ఎక్కువగా ఉండడంతో ‘ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు’ అం చనా వేయలేక పోతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఉనికికి ప్రమాదం అని గమనించిన బీజేపీ, ఎనిమిది సీట్ల విజయానికి సహకరించిన గులాబీ పార్టీ రుణం తీర్చుకునే పనిలో పడ్డదనే ప్రచారం ఊపందుకుంది.  

చులకన భావం

కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి కాం గ్రెస్ 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేయడంతో పాటు ఉపఎన్నికలో  బీసీ అభ్యర్థిని పెట్టి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. తన చి త్తశుద్ధిని చాటిన కాంగ్రెస్‌కు పార్టీలకు అతీతంగా మద్దతు కోసం బీసీల భవిష్యత్తుకు సవాలుగా మారిన ఉపఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు ఆత్మాభిమానాన్ని అస్త్రం గా ఎంచుకోవడం తప్పని పరిస్థితి, అటువంటిది బీసీ బిడ్డను పట్టుకొని రౌడీలకు ఓటు వేస్తారా? అంటూ బీసీ సమాజాన్ని బీఆర్‌ఎస్ అవహేళన చేస్తుంది.

అయితే నాడు కేసీఆర్ పార్టీకి చైతన్యరథం కొనిచ్చింది జూబ్లీ హిల్స్ అభ్యర్థి నాయన శ్రీశై లం యాదవ్ కాదా? నాడు కల్వకుంట్ల కుటుంబం శ్రీశైలం యాదవ్ తో చెట్టపట్టా లు వేసుకొని తిరిగిన ఫోటోలు అబద్దమా? ఇంటి ముందు గద్దెలమీద పార్టీ మనుగడకు డబ్బులు తీసుకున్నది నిజం కాదా? మీడియా ముఖంగా వస్తున్నా ఆరోపణలకు జవాబు ఇవ్వకుండా గెలుపు ఊపుమీద ఉన్న బీసీ బిడ్డకు రౌడీ పేరు అంటకట్టడం సమంజసం కాదు. అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు జూబ్లీ హిల్స్ ప్రజలు, బీసీ సమాజం కర్రు కాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నాడు బీసీలకు పెద్దపీట వేసిన టీడీపీ.. బీసీ వా దానికి వెన్నుదన్నుగా ఉన్న జనసేన.. బీజేపీతో ఉన్నప్పటికీ  కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ గెలుపు నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు చెప్పుతున్నారు.

ఇక్కడ పార్టీలు గమనించాల్సిన విషయం మర ణం సెంటిమెంట్ పేరుతో నాలుగు ఓట్లు వెనుకేసుకునే ఎత్తుగడలు ఎల్లవేలలా సాగ వు. నాడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రా మలింగారెడ్డి మరణం, ఉప ఎన్నికలో అ భ్యర్థిగా అయన సతీమణి పోటీలో ఉన్నప్పటికీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘు నందనరావు గెలిచిన సంగతి మరువద్దు. ఈ  ఉపఎన్నిక బీసీ సంఘాల ఆత్మగౌర వం, పరువు, ప్రతిష్టపై ఆధారపడి ఉంది, రిజర్వేషన్ల ఉద్యమ ఆకాంక్షను పాతరేయకుండా బీసీ లెఫ్ట్, బీసీ రైట్, బీసీ తటస్థ సం ఘాలు ఈగోలు పక్కన బెట్టి, కాంగ్రెస్ అ భ్యర్థి వల్లాల నవీన్ యాదవ్‌ను గెలిపించి బీసీ వాదాన్ని బతికించాల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 9866255355