06-11-2025 01:05:03 AM
తెలంగాణలో గురుకులాలు స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం.. దళి త, బహుజన పేద వర్గాల పిల్లలకు సమా న విద్యావకాశాలు కల్పించడమే. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం పూర్తిగా వ్యాపార దోపిడీ ధోరణికి మారిపోయింది. ఈ అవినీతి కార్యకలాపాలు అన్ని రకాల గురుకు లాల్లో కొనసాగుతుండడం బాధాకరం. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ శివారులో బీసీ గురుకుల పాఠశాలలో 20 టన్నులు బియ్యం నెలపాలు చేశారు.
మ రొక పాఠశాలలో అవినీతి పేరుకుపోయిం ది. ఎంతలా అంటే తినే తిండి దగ్గర కూడా అవినీతి పెరిగిపోవడమే. కూరల్లో నాణ్యతను పాటించరు. ఫర్నిచర్, గుడ్లు, వంట సామాగ్రి, ఆఫీస్ అవసరాలు ఇలా మ చ్చుకి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇలాం టి అవినీతి ఒక్కో జిల్లాలో, ఒక్కో పాఠశాలలో ఒక్కో విధంగా జరుగుతున్నాయి. కా నీ ఆశ్చర్యమేమిటంటే, ప్రభుత్వం లేదా గురుకుల సొసైటీ శాఖ నుంచి మాత్రం పట్టించుకోనట్లే ఉంటున్నాయి.
గురుకుల ప్రిన్సిపల్స్‌పై ఆరోపణలు, విచారణ లేకపోవడం, రీజనల్ కోఆర్డినేటర్, జాయింట్ డెరెక్టర్, సెక్రటరీల స్థాయిలలో లక్షలు అక్రమాలు ఇవన్నీ ప్రభుత్వ అశ్రద్ధకు చిహ్నాలుగా మిగిలిపోతున్నాయి. గురుకులాల్లో అనినీతిని, హింసించే ప్రిన్సిపల్స్‌ను తొలగించాలని విద్యార్థులు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.
పతనం దిశగా
షాద్‌నగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో జరుగుతున్న అవినీతి దందాపై శాంతియుత నిరసన తెలిపేందు కు వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీలతో జులుం ప్రదర్శించడం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ఏడవ హామీ.. అన్నీ ఒట్టి బూ టకపు మాటలుగా మారిపోయాయి. గురుకులాల్లో అవినీతి ఒక్కొక్కటి కాకుండా, వ్యవస్థాత్మక సూచికలుగా నిర్మితమవుతుండడం శోచనీయం.
ఈ అక్రమాలు కేవలం ఆహారంతో సంబంధం లేకుండా, మొత్తం విద్యా వ్యవస్థను కట్టిపడేస్తున్నాయి. విద్యార్థులు తగ్గిపోతుంటే, దళిత, గిరిజన ఆది వాసీ, మైనారిటీ, బీసీ కమ్యూనిటీలో వి ద్యా రేటు రోజురోజుకు పతనం దిశగా సాగుతుంది. ఇది సామాజిక అసమానతలను పెంచే అవకాశమెక్కువ. గురుకులాల ను ‘ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్’గా ప్రకటించినందున అవినీతి జరిగితే ప్రభుత్వ ప్రతిష్ఠ దె బ్బతింటుంది అనే సోయి పాలకులకు లేకపోవడం బాధపడాల్సిన విషయం. అవినీ తి ఏరులై పారినా పాలకులకు పట్టింపు ఉండదు.
ఈ పరిస్థితి రావడానికి ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌లో కొంతమంది రాజకీయ నాయకుల సిఫార్సులు, అండదండ ల ఆధారంగా పోస్టుల్లో చేరిన అధికారులపై చర్య తీసుకునే ధెర్యం లేకపోవడమే. వివిధ సంక్షేమ, విద్యాశాఖలో అంతర్గత విచారణ యంత్రాంగం బలహీనత, ఫిర్యాదులను దాచిపెట్టడం రోజు రోజుకు పెరి గిపోతుంది. దీని ఫలితంగా గురుకులాల్లో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులపై సస్పెన్షన్‌లు, బెదిరింపులు పెరిగిపోతున్నాయి.
పోలీసుల దౌర్జన్యం
షాద్‌నగర్‌లో ఇటీవల గురుకుల విద్యార్థినులు ర్యాలీలు, ధర్నా చేశారు. ప్రిన్సిపల్ శైలజ ‘నరరూప రాక్షసి’లా ప్రవర్తిస్తూ అందరినీ వేధింపులకు గురి చేస్తుందని.. అవినీతి ప్రిన్సిపల్‌ను వెంటనే తొలగించాలి’ అంటూ నినాదాలు చేశారు. విద్యా ర్థుల నిరసనలకు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
అయితే హైవే మీద ట్రాఫిక్ బ్లాక్ చేసి నిరసనలు చేయడం సరికాదని చెప్పినప్పటికీ, విద్యార్థులు మాట వినకపోవడంతో లాఠీచార్జీ చేయాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఒక మహిళా కాని స్టేబుల్ విద్యార్థిని విషయంలో దురుసుగా ప్రవర్తించడంతో, విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సంఘటనపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడాన్ని పౌరసమాజం ఖండించింది. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వేలం విషయంలో జరిగిన నిరసనలపై ఆంక్షలు వి ధించిన పోలీస్ బ్రూటాలిటీని ప్రతిబింబిస్తోంది. విద్యార్థులు శాంతియుతంగా నిర సిస్తుంటే, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, ఇదేం ప్రజాప్రభుత్వం అని విమర్శ చేయకుండా ఉండలేము. ఈ దుశ్చర్య విద్యార్థుల్లో భయాన్ని కలిగిస్తూ, వారిని విద్యకు దూరం చేస్తోంది.
ప్రజాస్వామ్య క్షీణత
కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల హామీని అమలు చేస్తామని చెప్పింది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ఏడవ హామీ తో, రాహుల్ గాంధీ ‘మోహబ్బత్ కా దు కాన్’ చెప్పారు. కానీ, ఈ గురుకుల విద్యార్థులపై పోలీసు యాక్షన్ లాంటి సంఘట నలు హామీల ఒట్టి బూటకాన్ని తేల్చాయి. ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను అణచివేయడంలో ఆసక్తి చూపుతోంది, కానీ మూల సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు. ఇది పాలిటికల్ అజెండాకు బదులు సామాజిక న్యాయానికి విరుద్ధం.
బడుగుల కమ్యూనిటీలు (తెలంగాణ జనాభా లో 75 శాతం) పేదలకు గురుకులాలు ఏకైకమని ఆశ రేకెత్తించారు పాలకు లు. ప్రభుత్వం అనేక బడులను నిర్వహాణ బాద్యత నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయనిపిస్తుంది. అందుకే ప్రైవేటు విద్యావ్య వస్థ విస్తృతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అది కాస్తా కార్పొరేట్ దశలకు మారిపోయింది. ఇలాంటి సమయాల్లో సామాజిక వెనుకబాటుతనంతో గురుకులాల్లో అవినీతి పెరిగిపోయి విద్యార్థులు అక్కడ ఇమ డలేక డ్రాపౌట్ అయితే సంక్షేమ పాఠశాల ల్లో విద్యార్థులు రేటు తగ్గిపోవడం ఖా యం. ఈ సమస్య దీర్ఘకాలంలో సామాజిక, ఆర్థిక అసమానతలను పెంచుతుంది.
గురుకులాల్లో అవినీతిపై తెలంగాణ హ్యూ మన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ స్పందించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య క్షీణతను సూచిస్తుంది. ఇలాంటి అంశాలపై మీడి యా కవరేజ్ తక్కువగా ఉండటం, సమస్య ను మరింత దాచిపెడుతోంది. ఈ సంఘటనలు తెలంగాణ విద్యా వ్యవస్థను అణి చివేస్తాయి. ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించి, అక్రమార్కులకు శిక్షలు విధించి.. విద్యను కాపాడాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకు లు ఇచ్చిన అన్ని హామీలు వొట్టి బూటకాలు కావని హామీలిచ్చిన పాలకులే చాటిచెప్పాలి.
వ్యాసకర్త సెల్: 9948872190