calender_icon.png 20 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

20-12-2025 01:44:00 AM

19 రోజులపాటు సాగిన చట్టసభలు

నిరవధికంగా వాయిదా

అణుశక్తిరంగంలో ప్రైవేటు పెట్టుబడుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలతో పాటు పలు బిల్లులు కూడా..

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. నిరవధికంగా వాయిదాపడ్డాయి. చివరిరోజు రాజ్యసభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన అనంతరం చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 1న ప్రారంభమైన సమావేశాలు 19 రోజు ల పాటు సగాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఉభ య సభల్లోనూ కేంద్రం ప్రవేశపెట్టిన కీలక బిల్లులపై వాడీవేడి చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు బిల్లులపై తమ గళం వినిపించారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ అణుశక్తి రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి వీలు కల్పించే బిల్లును ఆమోదించింది. బిల్లు ద్వారా దేశ ఇంధన రంగంలో భారీ మార్పులు, చేర్ప్లు వచ్చే అవకాశం ఉంది. సమావేశాల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘వీబీ -జీ రామ్ జీ’ అనే కొత్త బిల్లు ను ప్రవేశపెట్టింది.

కొత్త చట్టం ప్రకారం కూలీలకు 125 రోజుల పని గ్యారెంటీ లభిస్తుంది. బిల్లు ఆమోదం పొందే సమయంలో విపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. సభలో కాగితాలు చించివేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. కొందరు సభ్యులు వాకౌట్ కూడా చేశారు. అలాగే వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గీతంపై, ఎన్నికల సంస్కరణలపైనా చర్చ సాగింది. ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతినిచ్చే బిల్లు ఉభ య సభల ఆమోదం పొందింది. ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటరీ ఉమ్మడి కమిటీ పరిశీలనకు వెళ్లింది. మార్కెట్ సెక్యూరిటీ కోడ్ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపినట్లు సభా వర్గాలు వెల్లడించాయి.