20-12-2025 01:41:16 AM
శీతాకాల సమావేశాలు
ముగిసినందున స్పీకర్ టీపార్టీ
హాజరైన కేంద్ర మంత్రులు, అఖిల పక్షాల ఎంపీలు
ఆత్మీయంగా ముచ్చటించుకున్న ప్రధానిమోదీ, ప్రియాంకాగాంధీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పార్లమెంట్ సభ్యులకు తేనీటి విందునిచ్చారు. విందుకు ప్రధాని నరేంద్రమోదీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాత్ సింగ్, రామ్మోహన్‌నాయుడు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే, సీపీఐ అగ్రనేత డీ రాజాతోపాటు పలువురు అఖిలపక్ష ఎంపీలు హాజరయ్యారు. విందు సుహృత్ వాతావరణంలో సాగింది. సభ్యులు మధ్య నవ్వులు విరబూయించింది. ప్రధాని మోదీ, ఎంపీ ప్రియాంకా గాంధీ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రధాని మోదీ వాయనాడ్‌లో లభించే ఆయుర్వేద మూలిక గురించి ప్రియాంకకు తెలియజేశారు.
ఒక ఆయుర్వేద మూలిక వాడటం వల్ల తాను అలర్జీ సంబంధి త సమస్యల నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. పలువురు ఎంపీలు అనంతరం ‘వీబీ జీ రామ్‌జీ’ బిల్లుపై కాసేపు ప్రధానితో ముచ్చటించారు. పార్లమెంట్ పాత భవనంలో విధం గానే కొత్త పార్లమెంట్ కొత్త భవనంలోనూ ఎంపీల కోసం సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాని మోదీ ‘కీలక బిల్లులపై మీరు తర చూ నిరసనలు చేపట్టడం వల్ల సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. మీరెందుకు అరచి.. అరచి గొంతులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి మీరలా అలసిపోవద్దు’ అంటూ ప్రతిపక్షాలకు సరదాగా సలహా ఇవ్వడం అక్క డ నవ్వులు పూయించింది.