02-07-2025 12:00:00 AM
హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక వెంచర్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ కోసం క్లీమ్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణుమూర్తి దశా వతారాల పురాణగాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోంది. దీని కి అశ్విన్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశా య్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఫ్రాంచైజీలో మొదటిది ‘మహావతార్: నరసింహ-మొదటి భాగం’ జూలై 25న ఐదు ప్రధాన భారతీయ భాషల్లో అత్యాధునిక 3డీ ఫార్మాట్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం ప్రమో విడుదల చేసి, రాక్షస రాజు హిరణ్యకశిపు పాత్రను పరిచయం చేశారు. ‘అధర్మానికి రూపం.. దేవతలనే సవాలు చేసే తత్వం’ అంటూ మేకర్స్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.