30-10-2025 04:37:03 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో జరిగిన దుర్ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. బుధవారం ఉదయం నుండి మొంథా తుఫాన్ తో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాత్రి సమయంలో ఓ ఇంటి గోడ కూలి, ఆ ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ(58) అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఐనవోలు తహసీల్దార్, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇళ్లను గుర్తించి గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.