calender_icon.png 31 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

30-10-2025 04:35:41 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలిన సంఘటన పై గురువారం పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును మిల్లు యజమాని తిరుపతిరెడ్డినీ అడిగి తెలుసుకున్నారు.

దాసరి మనోహర్ రెడ్డి  వెంట గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు మోహన్ రెడ్డి , మనోజ్ గౌడ్ , రాజ మల్లయ్య , పాల రామారావు, గుడుగుల సతీష్, సురశ్యామ్,  అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, చంద్రమౌళి, కనకం శంకర్, ఎండి, రఫీక్ తో పాటు పలువురు ఉన్నారు, అలాగే రైస్ మిల్లుల యజమానులు జైపాల్ రెడ్డి, పురుషోత్తం రావు, శ్రీనివాస్ రెడ్డితో పాటు తదితరులు సందర్శించారు.