calender_icon.png 6 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు వరించనున్న మరో వాగ్దానం

03-05-2025 11:29:02 PM

- త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణంకు స్థల పరిశీలన 

- సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి సహకారంతోనే ట్రిపుల్ ఐటి వరించింది 

- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు నాయకులు.. ఫలితాలు వెలువడిన తర్వాత వాగ్దానాలు పట్టించుకున్న దాఖలాలు కూడా చాలామంది నేతల్లో కనిపించవు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాగ్దానాలు చేసిన ప్రతి ఒక్కటి విడుదలవారీగా ప్రాధాన్యతను ఇస్తూ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ దిశగానే మహబూబ్ నగర్ జిల్లాకు త్రిబుల్ ఐటీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలతో పాటు స్థల పరిశీలన ప్రక్రియ ఆరంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కి 3 మెగా ప్రాజెక్టులు వచ్చాయని వాటిలో ఐఐఐటి కళాశాల రావడం గర్వకారణమని, రూ 130 కోట్ల తో మన్యంకొండ పుణ్య క్షేత్రం అభివృద్ధి కి ప్రణాళికలు, ఇంటర్ స్టేట్ బస్టాండ్ ఏర్పాటు కు సియం అనుమతి, ఐఐఐటి కళాశాల మహబూబ్ నగర్ కు రావడంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జిఎంఆర్, అనిరుధ్ రెడ్డి ల సహకారం ఎంతో ఉందని తెలిపారు. 

ఎడ్యుకేషన్ హబ్ గా మహబూబ్ నగర్

జాతీయ స్థాయి లేదా  రాష్ట్ర స్థాయి  లో  పేరెన్నిక గల ఒక విద్యాలయాన్ని మహబూబ్ నగర్ కు తెస్తామని, మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా రాష్ట్రంలో నెంబర్ వన్ లో నిలపే విధంగా కృషి చేస్తానని నాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చానని అందుకు అనుగుణంగా  నేను నిశ్శబ్దంగా పనిచేస్తున్నన్నారు. నాకు కావాల్సింది మహబూబ్ నగర్ ను అన్నింట్లో మొదటి స్థానంలో ఉంచడమే తన మొదటి ప్రాధాన్యత  స్పష్టం చేశారు.  మహబూబ్ నగర్ లో ఐఐఐటి కళాశాల ఏర్పాటు గురించి సీఎం రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశంలో  వివరించడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారని,  ఐఐఐటి బాసర కళాశాల తరహాలో మహబూబ్ నగర్  ఐఐఐటి కళాశాల  ఉంటుందని చెప్పారు.  ఐఐఐటి కళాశాల ను మహబూబ్ నగర్ కు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యామని, వచ్చే విద్యా సంవత్సరమే కళాశాల ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   

ఐఐఐటి కళాశాల ఏర్పాటు కోసం 40-50 ఎకరాల భూమి అవసరం 

త్రిబుల్ ఐటీ కళాశాల ఏర్పాటు చేసేందుకు 40 నుంచి 50 ఎకరాల భూమి అవసరం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులతో అవసరమైన భూమి ఎక్కడ ఉందో పరిశీలన చేయాలని  చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఐఐఐటి బాసర వైస్ ఛాన్సలర్ బృందానికి  జిల్లాలో  రెండు మూడు ప్రాంతాల్లో సైట్ చూపించడం జరిగిందని, వారికి నచ్చిన సైట్ ను వారు ఎంపిక చేసుకుంటారని ఆయన తెలిపారు. 

రాబోయే కొన్ని రోజుల్లో కళాశాలకు సంబంధించిన అనుమతులు వస్తాయని ఆయన చెప్పారు.  ఇది ఎంతో గౌరవప్రదమైన విద్యాసంస్థ అని, బాసర ఐఐఐటి కళాశాల లో 9 వేల మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారని, మెరిట్ ఆధారంగా  మన ఉమ్మడి జిల్లా విద్యార్థులు కూడా చదువుతున్నారని, ఇక మన జిల్లా విద్యార్థులు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం  ఇక లేదని , మన మహబూబ్ నగర్ లోనే ఐఐఐటి కళాశాల లో చదువుకోవచ్చని  ఆయన స్పష్టం  చేశారు.  దేవరకద్ర, జడ్చర్ల ఎమ్మెల్యేలు శ్రీ జి.మధుసూదన్ రెడ్డి గారు, శ్రీ అనిరుధ్ రెడ్డి గారి సహకారం తోటి, ముఖ్యమంత్రి గారి సమ్మతి తో మనకు ఐఐఐటి కళాశాల వస్తున్నట్లు ఆయన చెప్పారు.  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని మాట ఇచ్చాం ఆ మాట మీదనే మేము నిబడ్డామని చెప్పారు.  అందుకు అనుగుణంగానే ఎన్నో విద్యాసంస్థలు మహబూబ్ నగర్ కు తెస్తున్నామని ఆయన చెప్పారు.

మహబూబ్ నగర్ లో ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి వివరించి, బస్ స్టాండ్ అవసరాన్ని వివరించామని, కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన లక్షల మంది శైవభక్తులు మన మహబూబ్ నగర్ మీదుగా శ్రీశైలం వెళ్తారని,  అందుకు అనుగుణంగా  ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి వివరించడం తో ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలిపారని , అలాగే మన్యంకొండ పుణ్య క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని, అక్కడ వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించేందుకు 130 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేయమని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు. 

మన్యంకొండ పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచి వాతావరణం కల్పించి,  వారికి అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.  మహబూబ్ నగర్ మండలం లోని చెరువులను కోయిల్ సాగర్ నుంచి లిఫ్ట్ చేసి నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ని కోరామని,  ఇరిగేషన్ మంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.   మహబూబ్ నగర్ ను అద్భుతమైన ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అవేజ్, కృష్ణయ్య యాదవ్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వేంకటాచారి తదితరులు పాల్గొన్నారు.