22-07-2025 10:30:18 PM
పటాన్ చెరు/జిన్నారం: జిన్నారం మండలం(Jinnaram Mandal) గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గడ్డపోతారానికి చెందిన సూరారం బాలమణి(64) ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం గడ్డపోతారం శివారులో బాలమణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి బొల్లారం పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.