22-07-2025 10:26:07 PM
హాలియా (విజయక్రాంతి): ప్రజా కవి, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్ అన్నారు. మంగళవారం పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో కృష్ణమాచార్య శత జయంతి కార్యక్రమాన్ని హాలియా పట్టణంలోని బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య చిత్ర పటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా చేసుకుని తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప పోరాట యోధుడు, ప్రజల కవి అని ఆయన రచనలు నాటి సమాజాన్ని మేల్కొలిపి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు దోహదం చేశాయని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజల కవి దాశరథి కృష్ణమాచార్య అని అన్నారు. కార్యక్రమంలో కందుల మదన్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, నీలా ప్రభాకర్, రమావత్ చెన్నా నాయక్, రామవత్ కళ్యాణ్ నాయక్, గురజాల రాకేష్, ఇరిగి సోమేష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.