22-07-2025 10:33:14 PM
ట్రైబల్ జర్నలిస్ట్(గిరిజన సంస్కృతి) అసోసియేషన్ అధ్యక్షులు రమావత్ ధర్మానాయక్..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారని(గిరిజన సంస్కృతి) ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రమావత్ ధర్మానాయక్ అన్నారు. మంగళవారం ప్రజా పాలనలో భాగంగా హైదరాబాదులోని గాంధీభవన్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar)కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మర్రిగూడెం మండలం నల్లగొండ జిల్లాలోనే ఉందని, ప్రజల అవసరాల నిమిత్తం నల్లగొండ వెళ్లాలంటే చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు. ఈ మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపితే 40 నిమిషాల సమయంలోనే రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మా మండల ప్రజలు చేరుకుంటారని ఆయన అన్నారు. మా మండలాన్ని రంగారెడ్డి జిల్లాతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని విలీనం చేయాలని మా మండల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మా మండలాన్ని తక్షణమే రంగారెడ్డి జిల్లాలో కలపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనం కలం సంపాదకులు నల్ల యాదయ్య, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.