25 March, 2026 | 2:10 AM

మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత

25-03-2026 12:38 AM

భద్రాచలం, మార్చి 24, (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుపై ఉన్న మక్కువతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ చదువుతూ తన కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తున్న ఊకె సింధుకు, మహిళా సమితి ఆధ్వర్యంలో ల్యాప్టాప్ అందజేయడం చాలా సంతోషకరమని  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.  మంగళవారం నాడు తన ఛాంబర్ లో మహిళా సమితి సభ్యులు పీవో చేతులు మీదుగా ఊకె  సింధు తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, బాబు లకు లాప్టాప్ ను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె చదువుపై ఉన్న ఆసక్తి ఎంతో గొప్పదని, మహిళా సమితి సభ్యులు బాలిక యొక్క కూతుహలాన్ని చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి లాప్టాప్ ను అందించడానికి ముందుకు వచ్చారని ఆయన అన్నారు.

లాప్టాప్ అందించడం ద్వారా ఆమెకు చదువులో మరింత సౌలభ్యం కలుగుతుందని, ప్రస్తుతం మెడికల్ విద్యలో డిజిటల్ సదుపాయాలు చాలా ముఖ్యమని, ఈ ల్యాప్టాప్ ద్వారా ఆమె ఆన్లైన్ క్లాసులు మెసేజ్ చేయడానికి సులభం అవుతుందని, భద్రాచలం మనిలా సమితి చేస్తున్న ఇటువంటి సేవలు చాలా అభినందనీయమన్నారు.   సమితి సభ్యులందరి సేవా భావం మరింత విస్తరించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మార్పులు తీసుకువస్తాయని, ఈ సహాయం ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, బి ఎం ఎస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ జి, కార్యదర్శి మాధవి మురళీకృష్ణ, సుభాషిని చంగల్ రావు మరియు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.