23-08-2025 01:06:06 AM
నిర్మల్ ఆగస్టు 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలు 150 మంది మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.