calender_icon.png 16 November, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి

08-03-2025 01:02:15 AM

పరేడ్ గ్రౌండ్లో  ఏర్పాట్లను పరిశీలన మంత్రి సీతక్క

 మహిళ  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉంది

హైదరాబాద్,(విజయక్రాంతి):  మహిళా ఆర్థిక స్వలంబన దిశగా మహిళ  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్  శాఖ మంత్రి డి అనసూయ సీతక్క  అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల  ఏర్పాట్లను  కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ  స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్   మహేష్ భగవత్, సెర్ఫ్ సీఈవో  దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి  ఆమె పరిశీలించారు. 

ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే  ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, మహిళాలాలకు ఆర్థిక స్వలంబన కల్పించెందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.  మార్చ్ 8న  సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు  మంత్రులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యాంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు మొదటి విడతలో 150 ఆర్ టి సి అద్దె బస్సులు అందించడం జరుగుతుందని అన్నారు.

జిల్లాల నుండి వచ్చే మహిళలందరికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా సమన్వయకంగా కలిసి పనిచేసి పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల నుండి దాదాపు 55 వేల పైగా మహిళలు పాల్గొంటున్నారని వేసవి దృష్ట్యా  ఆదిశాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని,  ఎక్కడ కూడా ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా ముందస్తు ప్రణాళికతో వచ్చే వాహనాలన్నింటిని పార్కింగ్ ప్రాంతాలకు తరలించాలని అలాగే  ఏర్పాటుచేసిన సెక్టార్లలో మహిళలు అందరినీ పంపించాలని ప్రతి సెక్టార్ లో త్రాగునీరు, బటర్ మిల్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన  గేట్ల ద్వారా వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు తప్పక ఉండాలని వచ్చిన వారందరినీ ఆయా గ్యాలరీలలో పంపించాలని సూచించారు. 

ప్రాంగాణంలో స్టేజ్ ఏర్పాట్లను ఆర్ అండ్ బి అధికారులతో అడిగి తెలుసుకుని స్టాల్స్, త్రాగునీరు, మెడికల్ స్టాల్స్ ,  మొబైల్ టాయిలెట్స్ అలాగే అగ్నిమాపక వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లో అందుబాటులో  ఉంచాలని జరుగుతున్న పనుల ఏర్పాట్లు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని  మంత్రి సూచించారు. వేడులకలో  భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 250 మంది కళాకారులచే  పలు రకాల సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ అలీ, హెచ్‌ఎం  డబ్ల్యూ ఎస్ ఎస్ బి   కమిషనర్ అశోక్ రెడ్డి, సెక్రటరీ పి. ఆర్  లోకేష్ కుమార్, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ డా. ఎస్. హరీష్, డి. ఐ జి  తక్సిర్ ఆహ్మద్, డి. ఐ. జి  లక్ష్మి పెరుమాళ, భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు  డాక్టర్ హరికృష్ణ, జిహెచ్‌ఎంసి అధికారులతో పాటు ఆర్ అండ్ బి, విద్యుత్,పోలీస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.