28-11-2025 12:22:19 AM
రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు
న్యూఢిల్లీ, నవంబర్ 27 :వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగియడంతో నాలుగో సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకూ డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ నిర్వహించనున్నట్టు లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. వేలం సందర్భంగా 2026 సీజన్ తేదీలపై క్లారిటీ ఇచ్చారు. ఊహించినట్టుగానే టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో డబ్ల్యూపీఎల్‌ను ఈ సారి త్వరగా నిర్వహిస్తున్నారు.
నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియం, వడోదర బీసీఏ స్టేడియాల్లో ఈ సీజన్ మ్యాచ్‌లు జరగను న్నాయి. గత సీజన్ నాలుగు వేర్వేరు నగరాల్లో జరగ్గా.. ఈ సారి మాత్రం నిర్వహణ సౌలభ్యం కోసం రెండు నగరాలకే పరిమితం చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో ఆరంభ మ్యాచ్ జరగనుండగా.. ఫైనల్‌కు వడోదర స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. త్వరలోనే పూ ర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు.
కాగా ఇప్పటి వరకూ జరిగిన మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు, ఆర్సీ బీ ఒకసారి చాంపియన్లుగా నిలిచాయి. ఇప ్పుడు వేలంతో పలు జట్ల కూర్పు మారడంతో నాలుగో సీజన్ మరింత హోరాహో రీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.