calender_icon.png 24 October, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశల వారీగా మౌలిక సదుపాయాలకు కృషి: ఎమ్మెల్యే వీరేశం

22-10-2025 05:57:09 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీలో దశలవారీగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 1, 8, 9 వార్డులలో రూ. 1.55 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ఆ సేవలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు.

నియోజకవర్గంలో ఐటి కళాశాల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, ప్రజారోగ్య డిప్యూటీ ఈ ఈ మనోహర, మున్సిపాలిటీ ఏఈ గౌతమ్ రాజ్, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కౌన్సిలర్లు కందాల బిక్షం రెడ్డి, గాజుల సుకన్య, రాచకొండ సునీల్, గడ్డం లక్ష్మీనరసింహస్వామి, బానోతు వెంకన్న, పన్నాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఎర్ర శంభు లింగారెడ్డి, యాసారపు వెంకన్న, పెద్ది యాదగిరి, చౌగోని సైదులు, మంటిపల్లి వీరు తదితరులు పాల్గొన్నారు.