calender_icon.png 24 October, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

22-10-2025 05:53:53 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ ఘనపూర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం దేవాలయంలో హోమం, అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ కార్యక్రమాలకు దేవాలయ ఫౌండర్, చైర్మన్, మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ విచ్చేసి హోమం, అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ననావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు వేముల రాజుగౌడ్, మాజీ వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్, మండల కృష్ణ గౌడ్, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, నాయకులు వేముల మహేశ్వర్ గౌడ్, వేముల కుమార్ గౌడ్, మంతెన సాయి రెడ్డి, వేముల ప్రకాష్ గౌడ్, వేముల విక్రమ్ గౌడ్, వేముల పృథ్వీరాజ్ గౌడ్, కట్కూరి భాను గౌడ్, కట్కూరి మంగ, కట్కూరి శ్రావణి, డొంకెన శ్రావన్ గౌడ్, వేముల మణిశరణ్ గౌడ్   దేవాలయ అర్చకులు దేవనూరి రాజేశ్వర్ శర్మ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.