22-10-2025 06:04:20 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని అష్ట్తోత్తర శతఘటాభిషేఖం, గిరి ప్రదక్షణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో శ్రీ బీర్ల అయిలయ్య విప్, శాసనసభ్యులు ఆలేరు, శ్రీ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారిచే కూచిపూడి నృత్యం నిర్వహించబడింది.