calender_icon.png 10 September, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజుల్లో యూరియా రాక

04-09-2025 12:00:00 AM

  1. వరద బాధితులకు పంట నష్టం ఇప్పిస్తా...
  2. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు 

మంచిర్యాల, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి): నియోజక వర్గంలో రైతులు ఎరువుల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి నియోజక వర్గానికి 400 టన్నుల ఎరువులు తీసుకువస్తున్నట్లు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తెలిపారు. బుధ వారం లక్షెట్టిపేటలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ ఆవరణలో దండెపల్లి, హజీపూర్, లక్షెట్టిపేట మండలాల రైతులతో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఫోన్‌లో మాట్లాడారు.

రెండు, మూడు రోజుల్లో ఎరువులు నియోజక వర్గానికి చేరుతాయని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. మంచిర్యాల నియోజక వర్గంలోని హాజీపూర్, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు 400 మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 8,800 బస్తాలలో దండేపల్లి మండలానికి నాలుగు వేల బస్తాలు, లక్షెట్టిపేట మండలానికి మూ డు వేలు, హజీపూర్ మండలానికి 1200 బస్తాలు, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు 500 బస్తాలు కేటాయించినట్లు వెల్లడించారు. 

ఈ నెల 9, 10 తేదీల్లోపు పూర్తి కోట 72 వేల బస్తాలు సరఫరా అవుతాయన్నారు. ఎరువుల కోసం క్యూలైన్‌లో పెద్ద సంఖ్యలో నిలుచుని ఇబ్బంది పడవద్దని కోరారు. గ్రామానికి ఎరువులు తీసుకువచ్చి రైతులకు ఇంటి సమీపంలోనే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అక్టోబర్ నెలాఖరులోపు ఇప్పిస్తానని ఎమ్మెల్యే  భరో సా ఇచ్చారు. పంట నష్టం సర్వే జరిగితే తప్ప కేంద్రం పరిహారం విడుదల చేయదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమి లేదని, ఇప్పటి వరకు వరద నష్టం ఇవ్వలేదని ఆరోపించారు.