calender_icon.png 22 December, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం

22-12-2025 12:00:00 AM

చేగుంట, డిసెంబర్ 21: చేగుంటలోని శ్రీ కార్తవీర్యా యోగాసనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా యోగాసనా స్పోరట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ఐక్యరాజ్య సమితి యుఎన్ లో ప్రకటించింది. ఇది ధ్యానం యొక్క మానసిక శారీరక ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటారని, ఈ రోజును భారతదేశం సహకారంతో యుఎన్ జీ ఏ తీర్మానం ద్వారా గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగ సాధకులు మనోహర్, సంతోష్ కుమార్, పెంటగౌడ్, ప్రశాంత్, చంద్రశేఖర్, పూర్ణచందర్, మహేష్, లింగమూర్తి నాంపల్లి శ్రీనివాస్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.