calender_icon.png 22 December, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి

22-12-2025 12:00:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న శాంతి నగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్2025 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటల వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతాయని తెలిపారు.

సిరిసిల్ల ప్రాంతం క్రీడలకు అనుకూల వాతావరణంతో అనేక ప్రతిభావం తు లైన క్రీడాకారులను తీర్చిదిద్దుతోందన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.రాబోయే రోజుల్లో జిల్లాలో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీల నిర్వహణకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. 

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ళు

వేములవాడ, డిసెంబర్ 21,(విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఆశలు నె రవేరుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని బాలనగర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం వల్ల ఎన్నో కుటుంబాలకు సొంతింటి కల నెరవేరి, భద్రతతో కూడిన జీవితం లభిస్తోందని అ న్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.