31-07-2025 12:47:59 AM
ఆరుబయటే కాల కృత్యాలు
గద్వాల జిల్లా అలంపూర్ గురుకులంలో అన్నీ సమస్యలే
కలెక్టరేట్‌కు విద్యార్థుల పాదయాత్ర
సమస్యలు పరష్కరించాలని విన్నపం
అలంపూర్, జూలై 30: గురుకులంలో పురుగుల అన్నం.. ఉప్పు నీళ్లు పెడుతున్నారని, స్నానానికి కూడా నీళ్లు లేవని, ఆరుబ యటే కాల కృత్యాలు తీర్చుకోవల్సిన పరిస్థితి నెలకొనడంతో సమస్యలు పరష్కరించా లని కోరుతూ బుధవారం గద్వాల జిల్లా అలంపూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయలుదేరారు.
వి షయం తెలుసుకున్న పోలీసులు మధ్యలోనే వారిని ఆపి, తిరిగి హాస్టల్‌కు చేర్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగిన వసతులు లేవు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలి. కానీ దానికి విరుద్ధంగా పురుగుల అన్నం పెడుతున్నారు. తాగేందు కు ఉప్పు నీళ్లే దిక్కవుతున్నాయి.
ప్రతిరోజు స్నానం చేసేందుకు కూడా సరిపడా నీళ్లు రావడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు లేక ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తున్నారు. అలా వెళ్లే సమయంలో పాములు, విషపురుగులు కా టేస్తే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌కి పలుమార్లు ఫిర్యాదులు చేసినా కాలక్షేపం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు.
దీం తో చేసేదేమీ బుధవారం విద్యార్థులంతా కలి సి హాస్టల్ నుంచి పాదయాత్రగా గద్వాల కలెక్టర్‌కు బయలుదేరా రు. హాస్టల్‌లో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేయాలని భావించారు. విద్యార్థు లు పాదయాత్ర చేసుకుంటూ రోడ్డు ఎక్కారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఏడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చిన విద్యార్థులను మధ్యలోనే ఆపారు. సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి, వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించుకుని పాఠశాలలో చేర్చారు.
పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్
విద్యార్థులు పాదయాత్ర చేపట్టిన విష యం అదనపు కలెక్టర్ నర్సింగరావుకు తెలియడంతో వెంటనే గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు వసతులు కల్పించాలని చెప్పారు. విద్యార్థుల సమస్యలు తెలిపేందుకు ఫిర్యాదు పెట్టేను ఏర్పాటు చేస్తామని చెప్పారు.