01-08-2025 12:00:00 AM
రోడ్ల పైన నడవాలంటే భయం భయం
ఎర్రుపాలెం, జూలై 31 (విజయక్రాంతి): మండల కేంద్రంతో సహా పలు గ్రామాలలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ సైర్య విహారం చేస్తున్నాయి. మండలంలోని జమలాపురం, బంజర, కండ్రిక, తెల్ల పాలెం, మీనవోలు ,తక్కెళ్ళపాడు ,,సకినవీడు, ములుగుమాడు, ఇనగాలి, గ్రామాలతో పాటు ,మండల కేంద్రంలో కోతులు రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను గాయపరిస్తున్నాయి.
కోతులు రోజు రోజుకీ తమ సంతానాన్ని వృద్ధి చేసుకోవడం తో కోతులు ఎదిగి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.మండల కేంద్రంలో ఇండ్లు, దు కాణాలు, కూరగాయ, పండ్ల దుకాణాలు, హోటల్లు, రోడ్లమీద, దేవాలయ ప్రాంగణాల వద్ద. పాఠశాలల, కళాశాలల దగ్గర, చెరువు కట్టల పైన తిరుగుతూ ప్రజలను, చిన్నారులను, వృద్ధులను గాయపరుస్తున్నాయి.
వీటి దాటికి ప్రజలు ఇండ్ల లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. పాఠశాలలకు ,కళాశాలలకు వెళ్లే రోడ్ల పైన తిరుగుతూ విద్యార్థులను గాయపరుస్తున్నాయి దేవాలయ ప్రాంగణాలలో భక్తులను గాయపరుస్తున్నాయి. ప్రజలు తమ ఇండ్లపైన, డాబాల పైన ఉండాలంటే భయపడుతున్నారు. ఇండ్లలో మంచాలపై నిద్రిస్తున్న వారిని సైతం ఇవి గాయపరుస్తున్నాయి.
ఇంటి ఆవర ణంలో ఉన్న పూల మొక్కలు ,కూరగాయ మొక్కలను కొరికి ధ్వంసం చేస్తున్నాయి. ఇంటి ఆవరణలోకి వచ్చిన కోతులను తరిమేస్తున్న ప్రజలను గాయపరుస్తున్నాయి. డాబాల పైన నివసిస్తున్న ప్రజలను కోతులు తరమడంతో అనేకమంది డాబాలపై నుండి కిందపడి గాయాల పాలవుతున్నారు. ప్రతినిత్యం రోడ్లపై తిరుగుతూ దుకాణాల నుండి సరుకులు, కూర గాయలు పండ్లు తీసుకెళ్లే వారిపై ఎగబడి గాయపరుస్తున్నా యి.
ఉదయం పూట వ్యాయామానికి , నడవడానికి వెళ్లే ప్రజలను గాయపరుస్తున్నాయి. చాలామంది ప్రజలు వీటి భారి నుండి రక్షించుకునేందుకు ఇండ్ల చుట్టూ సోలార్ విద్యుత్ కంచెలను నిర్మించుకుంటున్నారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులను రtక్షించుకునేందుకు సోలార్ విద్యుత్తు కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. కోతులు గాయపరిచినప్పుడు వెంటనే వైద్యం కొరకు ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారు దీనివల్ల తమకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు.
పేదలు వీటి బారినపడి గాయపడ్డప్పుడు సరియైన వై ద్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు.రైతులు పండించే పంట పొలాల్లో సైతం కోతులు సైర్య విహారం చేస్తున్నాయి. మొక్కజొన్న, బొప్పాయి, జామ, మామిడి, అరటి, పంటలు పండించే రైతుల పొలాల్లో తిరుగుతూ పింద దశలోనే వాటిని కొరికి పాడుచేస్తున్నాయి. వీటి బారి నుంచి రైతులు తమ పం ట పొలాలను రక్షించడం కొరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. తమ పంట పొలాలను కాపాడుకునే రైతులు ను సైతం ఇవి గాయపరుస్తున్నాయి.
రైతులు తమ పంట పొలాల దగ్గరకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు వేలాది రూపాయలు అప్పులు తెచ్చి పంట పొలాలను సాగు చేస్తుంటే కోతులు వచ్చి పంటలను తమ కళ్ళముందే ధ్వంసం చేయడంతో ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. కోతులను తమ గ్రామాల నుండి పట్టి అడవులలో వదిలేయాలని. తమ పంట పొలాలను రక్షించాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ,ప్రభుత్వ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.