calender_icon.png 10 July, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో రాజీనామా

10-07-2025 01:21:23 AM

న్యూయార్క్, జూలై 9: సామాజిక మాధ్య మం ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘రెండేళ్ల అద్భుత ప్రయాణం తర్వాత సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం, ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతలు అప్పగించిన మస్క్‌కు కృతజ్ఞతలు.’ అని లిండా పేర్కొన్నా రు. 2023 మే నుంచి రెండేళ్ల పాటు ఎక్స్ సీఈవోగా లిండా వ్యవహరించారు. కాగా లిండా ప్రకటనపై మస్క్ స్పందిస్తూ.. ‘ మీ సేవలకు ధన్యవాదాలు’ అని పోస్టు పెట్టారు.