calender_icon.png 10 July, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన యుద్ధ విమానం

10-07-2025 01:22:56 AM

- ఇద్దరు పైలట్ల కన్నుమూత

- రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఘటన

జైపూర్, జూలై 9: రాజస్థాన్‌లో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమా నం కూలిపోయింది. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన భనుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఇద్ద రు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. జాగ్వార్ యుద్ధ విమానం సూరత్‌గఢ్ ఎయి ర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది.

కూలిపోవడానికి ముందు ఫైటర్ జెట్ నియంత్రణ కోల్పోయినట్టు కనిపించిందని స్థానికులు వెల్లడించారు. ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించిందని, మండిపోతూ పొలాల్లో పడిపో వడాన్ని గమనించి నట్టు పేర్కొన్నారు. శకలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. గత ఏప్రిల్‌లో కూడా గుజరాత్ సమీపంలోనే జాగ్వార్ యుద్ధ విమానం నేలకూల డం గమనార్హం.

ప్రమాదంపై భారత వాయుసేన స్పందించింది. ‘సా ధారణ శిక్షణా కార్య క్రమాల్లో భాగంగా ఏఐఎఫ్ జాగ్వార్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదా నికి గురైంది. ఇద్దరు పైలట్లు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ కఠిన సమయం లో వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తు న్నాం. ఘటనలో పౌర ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు’ అని పేర్కొంది.