29-08-2025 03:25:13 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 28 (విజయ క్రాంతి): గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం సాఫీగా, పర్యావరణహితంగా జరిగేలా చూసేందుకు నగరవ్యాప్తంగా 74 కృత్రిమ నిమజ్జన కేం ద్రాలను ఆర్టిఫిషియల్ ఇమర్షన్ ప్లాంట్స్.. ఏర్పాటు చేసింది. ఇందులో పోర్టబుల్ వాట ర్ ట్యాంకులు, ఎక్స్కవేషన్ పాండ్లు, శాశ్వత బేబీ పాండ్లు ఉన్నాయి. ఈ చర్యల వల్ల ప్రధాన చెరువులైన హుస్సేన్ సాగర్, సరూర్నగర్, ఐడీఎల్ చెరువులపై ఒత్తిడి తగ్గనుం ది. అలాగే, భక్తులు గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, సమీపంలోనే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కృత్రిమ నిమజ్జన కేంద్రాలు ఇవే..
తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకులు - 24, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఏ.ఎస్.రావు నగర్, సచివాలయ నగర్, ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్, ఎం.ఆర్.ఓ. ఆఫీస్, హయత్నగర్, క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ పక్కన, సుష్మా థియేటర్, వనస్థలిపు రం, గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ వెనుక, శివాలయం గ్రౌండ్, రి యాసత్నగర్, లక్ష్మణేశ్వర ప్లేగ్రౌండ్, జంగం మెట్, రామ్ లీలా గ్రౌండ్, చింతల్ బస్తీ, ఎస్బిఎ గార్డెన్ ఎదురుగా, 100 అడుగుల రోడ్డు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ - 2, అమీర్పేట్ ప్లేగ్రౌండ్, తాత్కాలిక ఎక్స్కవేషన్ పాండ్లు - 23, దేవేందర్ నగర్ రోడ్, హుడా భారతి నగర్ పార్క్, జెడ్.పి.రోడ్, హస్తినాపురం, ఎన్.టి.ఆర్.నగర్ వెజిటబుల్ మార్కె ట్, ఫ్రెండ్స్ కాలనీ షటిల్ కోర్ట్, ఎస్బిహెచ్ కాలనీ, సైదాబాద్, బతుకమ్మ బావి, కందికల్ గేట్, గౌలిపురా, వైశాలి నగర్, ఇస్సాదా న్, నర్సాబైకుంట, మైలార్దేవ్పల్లి, సంజీవిని హిల్స్, మూసీ నది పక్కన, ఉప్పర్ పల్లి, బేబీ పాండ్లు (శాశ్వతమైనవి) - 27, ఎల్.బి.నగర్ జోన్, చర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, చార్మినార్ జోన్.. పాఠి కుంట, రాజన్న బావి, ఖైరతాబాద్ జోన్, నెక్నాంపూర్ నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, శేరిలింగంపల్లి జోన్, గంగారం చెరువు, కైదమ్మ కుంట, గురునాథం చెరువు, రాయ సము ద్రం, కూకట్పల్లి జోన్.. ముల్కత్వ చెరువు, ఐడీఎల్ బేబీ పాండ్, బాలాజీ నగర్, మూసాపేట్, బోయిన్ చెరువు బేబీ పాండ్, ప్రగతి నగర్ బేబీ పాండ్, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, వెన్నెల గడ చెరువు, లింగం చెరువు, సురారం (మైసమ్మ దేవాలయం పక్కన), కొత్త చెరువు, అల్వాల్ దేవాలయం, సికింద్రాబాద్ జోన్.. సంజీవయ్య పార్క్, సఫిల్గూడ, బండ చెరువు
నిమజ్జన కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలను నియమించింది. నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక ఇన్ఛార్జ్ అధికారి, నోడల్ అధికారి, అలాగే డిప్యూటీ కమిషనర్ కూడా ఉంటారు. విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలుగా తగిన సంఖ్యలో క్రేన్లు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తారు.