calender_icon.png 26 January, 2026 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధకారంలోకి వెళ్తోన్న విద్యార్థుల భవిష్యత్తు

26-01-2026 12:34:09 AM

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ఖైరతాబాద్, జనవరి25(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోంది అని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. హిమాయత్ నగర్ డివిజన్, కింగ్ కోటి పరిధిలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో పురుగుల అన్నం, అపరిశుభ్రమైన వంటశాల కారణంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రభు త్వం కనీసం పౌష్టికాహారం అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.