calender_icon.png 26 July, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా వెల్నెస్ సెషన్ కిమ్స్- సన్‌షైన్ ఆసుపత్రిలో నిర్వహణ

25-07-2025 02:37:45 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ సెల్ఫ్-కేర్ డే సందర్భంగా గురువారం కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేట్‌లో ‘యోగా ఫర్ ఆల్’ అనే ప్రత్యేక వెల్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్టిఫైడ్ యోగా పండితురాలు, థెరపిస్టు, ఫేస్ యోగా నిపుణురాలు కార్త్యీని అంకుష్ ఆధ్వర్యంలో గంటపాటు నిర్వహించిన సెషన్‌లో కుర్చీపై సులభంగా చేసే యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం,

అలాగే దైనందిన స్వీయ సంరక్షణ కోసం ఉపయోగకరమైన సూచనలు చేశారు. డాక్టర్ ఏవి గురువారెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బందికి స్వీయ సంరక్షణ అనేది విలాసం కాదు, అవసరం అన్నారు. ప్రతిరోజూ జాగ్రత్తగా శ్వాస వ్యాయామం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.