calender_icon.png 27 July, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీతో బీసీ సంక్షేమ సంఘాల భేటీ

25-07-2025 02:37:51 AM

  1. కేంద్ర మంత్రులతోనూ సమావేశం
  2. ప్రత్యేక మంత్రిత్వ శాఖకు డిమాండ్

హైదరాబాద్,సిటీ బ్యూరో జూలై 24,(విజయక్రాంతి): బీసీల హక్కుల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సం ఘాలు తమ గళాన్ని బలంగా వినిపించాయి. బుధవారం పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరితో పాటు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని బీసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు.

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌తో భేటీ

కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్, ఢిల్లీ ఇన్‌ఛార్జి కర్రి వేణుమాధవ్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నందగోపాల్, మహిళా విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షురాలు శారద తదితరులు కలిశారు.

ఈ భేటీలో రాజ్యసభ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఎంపీలు పాకాల సత్యనారాయణ, పుట్ట మహేశ్ యాదవ్ తదితర ఎంపీలు కూడా పాల్గొన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేశారు.

రాహుల్‌గాంధీకి వినతిపత్రం

అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కూడా బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను వెంటనే మంజూరు చేయాల న్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలని రాహుల్ గాంధీని కోరారు.

సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 36 బీసీ సంఘాలు, 28 బీసీ కుల సంఘాలు, 32 ఉద్యోగ సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి.