07-10-2025 01:35:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ బీరంగూడలోని గ్రీన్ మెడోస్ మెయిన్ పార్క్‌లో యోగ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడెల్లి రవీందర్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, గౌరవ అతిథిగా ఎడ్ల రమేష్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, నందరం నరసింహ గౌడ్, ఎక్‌స మున్సిపల్ వైస్ చైర్మన్ అమీన్పూర్, ఆగారెడ్డి, ఎక్స్ కౌన్సిలర్, గోపి ఆనంద్, అనంత్‌రెడ్డి పటాన్‌చెరు మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్, రఘుపతిరెడ్డి, ఎక్స్ ఆర్మీ పర్సన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి గ్రీన్ మేడోస్ అసోసియేషన్ సభ్యులు యూత్ ఫర్ సేవ వలంటీర్స్ సహాయ సహకారాలు అందజేశారు. బేబీ మహాస్విచే కూచిపూడి నృత్యం, మధు హాసిని కొల్లోజు బృందం బీట్‌బాక్సింగ్, గాన ప్రదర్శన చేశారు. ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ, ఫౌం డేషన్ ద్వారా కళాత్మక యోగా నృత్య ప్రదర్శన చేశారు. యోగా టీచర్ రుధ్రాణి చేత శక్తినిచ్చే యోగా ఆసనాలు వేసి చూపించా రు. విజ్ఞాన శాస్త్రాన్ని ఆధ్యాత్మికతతో సమన్వయం చేయడం, ఆరోగ్యం, సాధికారత కోసం సమగ్ర మార్గాలను సృష్టించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.