calender_icon.png 7 October, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

07-10-2025 01:36:33 AM

-బాకీ కార్డు ఉద్యమం ఉధృతం చేద్దాం

-బీఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా నేతలు   

మేడ్చల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, దీనిపై కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా నేతలు నిర్ణయించారు. సోమవారం దుండిగల్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షు డు సుంకరి రాజు అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, వంచనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రతి ఇంటికి చేరాలన్నారు. సమావేశంలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కా జిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.