calender_icon.png 20 December, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

20-12-2025 02:23:38 AM

డీలర్ నుంచి10వేలు తీసుకుంటూ పట్టుబడిన ఆంజనేయులు  

వనపర్తి, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఏసీబీ అధికారులకు వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. యూరియా కేటాయింపుకోసం జిల్లా వ్యవసా య శాఖ అధికారి ఆంజనేయులు ఓ డీలర్ నుంచి రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా 10వేలు లంచం తీసుకున్నా డు. మిగిలిన రూ.10వేలు ఇవ్వాలని ఆ డీలర్‌ను ఒత్తిడి చేశాడు. దీంతో డీలర్ తప్పని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారుల సూచనలు సలహాలతో డీలర్ శుక్రవారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారికి రూ.10 వేలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకొని విచారించగా లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి  నాంపల్లి ఏసీబీ  కోర్టులో ప్రవేశపెడతామన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ అన్నారు.