18-04-2025 10:29:09 PM
గ్రామాల్లో పోలీసుల కళాజాత
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రజలు సైబర్ నేరాల ఉచ్చులో పడకూడదని, సెల్ఫోన్లో తెలిసి తెలియని లోన్ యాప్ ద్వారా రుణాలు పొందేందుకు ప్రయత్నించకూడదని, అలాగే కొన్ని అవాంచిత మెసేజ్లకు సంబంధించిన లింకులను ఓపెన్ చేయకూడదని తద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతుందని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నారు. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, గుట్కా, గుడుంబా వినియోగం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకేన్ ఆదేశాల మేరకు చిన్న నాగారం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా కళాజాత బృందం ఆయా అంశాలపై కళారూపాలతో వివరించారు.