20-11-2025 12:16:54 AM
అలంపూరు, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్రరావుని వడ్డేపల్లి మండలానికి చెందిన బిజెపి యువ నాయకులు బిజెపి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ బాధ్యులు వేణుగోపాల్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాదులో రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా ఇంచార్జీల సమావేశ కార్యక్రమంలో కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ అభివృద్ధి సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో ప్రజలకు చేరువ వేయాలని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపినట్లు ఆయన అన్నారు.