29-07-2025 07:36:07 PM
విజయ డైరీ, పాడి పరిశ్రమ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డికి విన్నవించిన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చింతకుంట తిరుపతిరెడ్డి మరికొందరు రైతులు కలిసి మంగళవారం హైదరాబాద్ లో విజయ డైరీ, పాడి పరిశ్రమ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో విజయ పాల ఉత్పత్తులు, ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని కోరారు. రైతులకు పాల ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర పహాడ్ బిఎంసి అధ్యక్షులు నరసింహారెడ్డి, భిక్కనూర్ బిఎంసి అధ్యక్షులు రోహిత్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.