16 April, 2026 | 4:25 PM

ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి

30-05-2025 12:51 AM

నాగల్ గిద్ద, మే 29 : సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని కారస్ గుత్తి  గ్రామంలో బుధవారం రాత్రి  రేఖ నాయక్ తండాకు చెందిన సుధాకర్(22)  పొలాల్లో ట్రాక్టర్ తో  నాగళ్ళు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తుగా పొలం పక్కన ఉన్న గుంతలో ట్రాక్టర్ బోల్తా పడటంతో  యువకుడు మృతి చెందాడు. గురువారం రేఖ నాయక్ తండాలో అంత్యక్రియలు జరిగాయి.