20-11-2025 12:25:19 AM
పాపన్నపేట, నవంబర్ 19 :ట్రాక్టర్-ఆటో ఢీ కొన్న ఘటనలో యువకుడు మృతి చెం దిన సంఘటన మండల పరిధి నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. పోడ్చన్ పల్లి గ్రామానికి చెందిన పచ్చ దేవరాజ్(17) వృత్తి రిత్యా విద్యార్థి. గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి అపుడపుడు క్యాటరింగ్ బాయ్ గా చేసేవాడు. మంగళవారం ఉదయం గ్రా మానికి చెందిన కొందరితో కలిసి ఆటోలో ఏడుపాయలకు వెళ్లాడు.
అక్కడ క్యాటరింగ్ పని ముగించుకొని తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తుండగా నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా ఆటోలో ఉన్న దేవరాజ్ తో పాటు ఆటోలో ఉన్న మరికొందరికి గా యాలయ్యాయి.
స్థానికులు గమనించి చికి త్స నిమిత్తం వారిని అంబులెన్సులో మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్క డి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అర్థరాత్రి సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.