calender_icon.png 29 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

29-01-2026 12:35:28 AM

సిద్దిపేట క్రైం,జనవరి 28 : ఈ నెల 18న భార్యను హత్య చేసి, అడ్డొచ్చిన కూతురిపై హత్యాయత్నానికి పాల్పడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రిమాండ్ కు తరలించామని సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. సిద్దిపేట మండలం దూల్మిట్ట మండలం బెక్కల్‌గ్రామానికి చెందిన దున్నపోతుల శ్రీలత, ఎల్లయ్యకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది.

వారికి ఒక కూతురు హర్షిత (16),ఒక కుమారుడు అజయ్ (14) ఉన్నా రు. పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉండి చదువుతుండగా, భార్యాభర్తలు సిద్దిపేటలోని ఆద ర్శనగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కాని, ఈ నెల 18న పిల్లలతో కలిసి నిద్రిస్తున్న శ్రీలత తలపై భర్త రోకలితో మోది,కత్తితో గొంతు కోసి చంపా డు. అడ్డువచ్చిన కూతురు హర్షిత తలపై రోకలితో కొట్టి కత్తితో గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు.

అనంతరం ఎల్లయ్య తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యకుయత్నించాడు. ఇంట్లో ఉన్న అజయ్ ఇద్దరిని హాస్పిటల్ లో చేర్పించాడు. ఈ నెల 19న శ్రీలత తండ్రి శివరాత్రి కనక పోచయ్య ఫిర్యాదు మేరకుసిద్దిపేట టూటౌన్‌ఇన్స్పెక్టర్ ఉపేందర్‌కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు ఎల్లయ్యను బుధవారం అదుపులోకి తీసుకొని, కోర్టు ఆదేశానుసారం రిమాండ్‌కు తరలించేసినట్టు తెలిపారు. హర్షితహైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని చెప్పారు.