12-01-2026 12:00:00 AM
శామీర్‌పేట్, జనవరి 11 : క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని మేడ్చల్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహాయాదవ్ అన్నారు. అదివారం మూడుచింతలపల్లి మున్సివల్ లోని మిని స్టేడియంలో మాజి ఉపసర్పంచ్ వంగ వెంకటరమణరెడ్డి క్రికెట్ కిట్, వాలీబాల్, ఫుట్ బాల్, క్యారమ్స్, చెస్ ఆటలకు సంబందించిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా విచ్చేసిన బొమ్మలపల్లి నర్సిహాయాదవ్ మాట్లాడుతూ యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు.
యువకులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ ఉత్తమ ప్రతిభచూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి కాంగ్రెస్ అద్యక్షుడు దోసకాయల వెంకటేష్, మాజి ఉపసర్పంచ్ లక్ష్మారెడ్డి, మాజి వార్డు సభ్యులు రాజేంద్రప్రసాద్ గౌడ్, నాయకులు బస్వారెడ్డి, శశిధర్రెడ్డి, బాలకృష్ణ, రాము, యాదగిరి, ప్రతాప్ రెడ్డి , యువకులు పాల్గొన్నారు.