calender_icon.png 10 July, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ సంతోషమే మా లక్ష్యం

10-07-2025 12:08:18 AM

  1. 39 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన

ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్

మహబూబ్ నగర్ జులై 9 (విజయ క్రాంతి ) : ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రజాపాలన ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించి అడుగులు వేస్తుందని ప్రజా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 39 మంది లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చె క్కులను వారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి  విద్య, వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో ఫస్ట్ స్థానంలో నిలిపేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తు న్నారని అన్నారు. 

గత పది సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు విద్య వైద్యం రెండు కూడా నిర్లక్ష్యానికి గురైనవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రా ములు యాదవ్, సిజె బెనహార్, అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, ఎల్లంగారి భరత్ కుమార్, ఏర్పుల నాగరాజు, మోయీజ్, అబ్దుల్ హక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాషెద్ ఖాన్, జాజి మొగ్గ నర్సింహులు, ఖాజా పాషా, చిన్న తదితరులు పాల్గొన్నారు.