28-11-2025 12:53:02 AM
షాద్‌నగర్, కందుకూరు డివిజన్ లల్లో నామినేషన్లు షురూ
చేవెళ్ల, నవంబర్ 26(విజయక్రాంతి): పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. ఇందులో కూడా కొద్దో గొప్పో డబ్బులున్న యువకులు సిద్ధం అంటూ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, కందుకూరు, షాద్ నగర్, రాజేంద్ర నగర్ డివిజన్ లోనీ పల్లెల్లో పంచాయితీ ఎన్నికల సందడి మొదలైంది.గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం తో గురువారం నామినేషన్ల ప్రక్రియ మొదలయింది.
దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన సానుభూతిపరుల ఎంపికపై దృష్టిసారించారు. ఎన్నికల్లో సర్పం, వార్డు సభ్యులుగా ఎవర్ని దించితే గెలుపు అవకాశాలుంటాయన్న దానిపై ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన గ్రామ నేతలు, కార్యకర్తలు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత లో షాద్ నగర్ డివిజన్ లో 174 గ్రామ పంచాయతీలు, 1530 వార్డు లకు గాను 1530 పోలింగ్ స్టేషన్ల లను ఏర్పాటు చేయడం జరిగింది.
రెండో విడత లో చేవెళ్ల, కందుకూరు డివిజన్ లాల్లో 178 పంచాయతీ లు, 1540 వార్డు లకు గాను 1540 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.మూడో విడత ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ లలో 174 పంచాయతీ లు, 1598 వార్డు లకు 1812 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు... మొత్తం గా జిల్లా లో 526 పంచాయతీ లు, 4668 వార్డు లకు గాను 4682 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
174 పంచాయతీల్లో ఎన్నికలు
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు, 4668 వార్డులు ఉన్నాయి. మొదటి విడత లో174 గ్రామ సర్పం, 1530 వార్డు మెంబర్ల కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. షాద్ నగర్, రాజేంద్ర నగర్ డివిజన్లు ఎన్నికల సందడి మొదలయింది.
తొలి రోజు ఏడు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు మండలాల్లో సర్పంచుల స్థానాలకు 145, వార్డు స్థానాలకు 119 నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఫరూక్నగర్ మండలంలో 34,జిల్లేడు చౌదరి గూడెం లో 30,కేశంపేట లో 24 కొత్తూరు లో 11, కొందూర్గులో 13, నందిగామ లో 16,షాబాద్ 17 లో సర్పం స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.