calender_icon.png 13 January, 2026 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి పెద్దపీట

13-01-2026 01:05:32 AM

రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వివేక్ 

చెన్నూర్, జనవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. సోమవారం నియోజక వర్గంలోని చెన్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహ భవనాన్ని, కోటపల్లి మండలం కొల్లూరులో సాండ్ రీచ్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు.

మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి చెన్నూర్ పట్టణంలో కొన సాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మా ణ పనులను పరిశీలించి వేగవంతం చేసి త్వర గా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, మైనింగ్ ఎ.డి. జగన్మోహన్ రావు, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డి, చెన్నూర్ ఏడీఏ పసాద్ పాల్గొన్నారు.