calender_icon.png 13 August, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత రక్తదానంలో ముందుండాలి

13-08-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, ఆగస్టు 12 (విజయ క్రాంతి): యువత రక్తదానంలో ముందుడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో కళాశాల పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాలరాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కళాశాల ఆడిటోరియంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహిం చారు.

కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు.  కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న , కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘు కుమార్, దస్థిరం, నరసింహం, రమేష్ రెడ్డి,  కాలేజీ అధ్యాపకులు శ్రీనివాస్ రావు, సుధాకర్,  కీర్తిశేషులు బాలరాజు భార్య, పిల్లలు, విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు.