calender_icon.png 13 August, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ

13-08-2025 12:00:00 AM

కామారెడ్డి, ఆగస్టు 12 (విజయ క్రాంతి): కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బార్ అసోసియేషన్ హాల్లో మంగళవారం అధ్యక్షులు నంద రమేష్  హెల్త్ కార్డులను న్యాయవాదులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ మాట్లాడుతూ,  న్యాయవాదులకు హెల్త్ కార్డులు చాలా ఉపయోగకరంగా వుంటాయని, ఈ కార్డు ద్వారా 2 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందవచ్చని అన్నారు.

హెల్త్ కార్డులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ న్యాయవాదులకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని అందులో భాగంగా న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఈ హెల్త్ కార్డులను ఇచ్చారన్నారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్ రెడ్డి,అడిషనల్ పీపీ నిమ్మ దామోదర్ రెడ్డి, అమృతరావు, బి.దామోదర్ రెడ్డి, గజ్జెల బిక్షపతి, లక్ష్మణ్ రావు, ప్రదీప్ రెడ్డి, జడల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.