calender_icon.png 9 July, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాగుట్టలో వైఎస్‌ఆర్ జయంతి

09-07-2025 12:00:00 AM

నివాళులర్పించిన డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని ఆయన విగ్రహానికి డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. 

కట్ట మైసమ్మకు బోనం

టీజేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కనకదుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన బోనాల జాతరలో డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.