2 July, 2026 | 11:55 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

Districts - Yadadri Bhuvanagiri

article_70610966.webp
యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

యాదాద్రి: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష(Yadagirigutta Temple Development) నిర్వహించారు. హరేరామహరేకృష్ణ ఫౌండేషన్ కు భూమి కేటాయింపుపై చర్చించారు. హరేరామ ఫౌండేషన్ కు మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలని ఆదేశించారు. మఠాలు, కుల సంఘాల భూకేటాయింపులకు స్పష్టమైన విధానం తేవాలని, తిరుమల మోడల్‌లో గెస్ట్‌హౌస్‌లు, భూ హక్కుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. భూసేకరణకు నిధులు మంజూరు చేయాలని, ఇంజనీర్ల కమిటీ నివేదికను వారంలో అధ్యయనం చేసి తుది నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సూచించారు. యాదగిరిగుట్టపై గెస్ట్‌హౌస్‌ ల నిర్మాణానికి ముందుకొచ్చే వారి జాబితా రూపొందించాలని సూచించారు. విడతల వారీగా గెస్ట్‌హౌస్‌లు, భూ హక్కుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.

30-06-2026